జగన్ని కూడా లాగిన KCR



  కెసిఆర్ విద్యుత్ సంస్కరణలు అంటూ కేంద్రం తీసుకువచ్చిన తీసుకువచ్చినవి రైతులకు ఇబ్బంది పెట్టేవనే తాము అమలు చేయడంలేదని అన్నారు. ఇక కేంద్రం పార్లమెంట్ లో ఈ సంస్కరణల బిల్లు ఆమోదం పొందకముందే అమలు చేస్తోందని గుస్సా అయ్యారు. తాము  రైతుల మేలు కోరే పాలకులమని ససేమిరా వాటిని అమలు చేసేది లేదని కూడా తేల్చి చెప్పారు.


పొరుగున ఉన్న ఏపీ సర్కార్ మాత్రం విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తోందని జగన్ ప్రస్థావన కూడా కేసీయార్  తీసుకువచ్చారు. ఏపీలో కొన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 25 వేల విద్యుత్ మోటార్లకు  మీటర్లు పెట్టారని ఆయన అన్నారు. కేంద్రం చెప్పకుండానే జగన్ ఈ పని చేస్తున్నారా అని కూడా అడిగారు.


మొత్తానికి మోడీ వర్సెస్ కేసీయార్ అన్నట్లుగా కొన్ని రోజులుగా సాగుతున్న మాటల యుద్ధంలో ఇపుడు సడెన్ గా జగన్ని కూడా తీసుకువచ్చారు. రైతులకు పూర్తి వ్యతిరేకమైన ఈ విద్యుత్ సంస్కరణలను తాము అమలు చేయమని చెబుతున్న కేసీయార్ ఏపీలో రైతులను ఆ విధంగా జగన్ సర్కార్ మీద వ్యతిరేకత వచ్చేలా చేస్తున్నారా అన్నదే చర్చగా ఉంది.

Comments

Popular posts from this blog

A Prince of Light inspiration for Prabhas movie

Kgf2&salaar great deal!!!!